శరీరంలో యూరిక్ యాసిడ్‎ను వేగంగా తగ్గించే డ్రింక్స్ ఇవే

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే దాన్ని గౌట్ అంటారు. శరీరంలోని ప్యూరిన్స్ అనే పదార్థాలు యూరిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తాయి.
యూరిక్ యాసిడ్ ను ప్రేరేపించే కొన్ని పదార్థాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్యూరిన్ తోపాటు ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలకుదూరంగా ఉండాలి.
శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగినప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ఈ డ్రింక్స్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. అవేంటో చూద్దాం.
నిమ్మకాయ యూరిక్ యాసిడ్ నియంత్రణలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గ్రీన్ టీలో పుష్కలంగా ఉన్నాయి. ఇది యూరిక్ యాసిడ్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ శరీరంలో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తుంది.
అల్లం టీ యూరిక్ యాసిడ్ లో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం నీటిలో వేసి మరిగించి అందులో తేనె కలుపుకుని తాగాలి.
దోసకాయ రసం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరం నుంచి టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. కిడ్నీలను డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది.
రోజుకు 1 కప్పు చెర్రీ జ్యూస్ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది.
యూరిక్ యాసిడ్ ఒక తీవ్రమైన వ్యాధి. ఇందులో ఆహారం, నీరు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు ఈ జ్యూసులు తాగే ముందు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోండి.