ఈ పండ్లు తింటే మీ జుట్టు పట్టుకుచ్చులా పెరుగుతుంది

జుట్టు రాలడం
ఒత్తిడి, పోషకాహార లోపం, పర్యావరణం, కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది.
నేటికాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారించేందుకు ఎన్నో ఉత్పత్తులను వాడుతున్నారు.
సమతుల్య ఆహారంతోపాటు ఈ ఐదు రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకుంటే జుట్టు పెరగడం ఖాయం.
అరటి
అరటి పండ్లలో విటమిన్స్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. జుట్టును పెరిగేందుకు ప్రోత్సహిస్తాయి. అంతేయకాదు చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.
బొప్పాయి
బొప్పాయిలో విటమిన్ ఎ, ఇ, సి ఉన్ానయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. హెల్తీ స్కాల్ఫ్ ను నిర్వహించి జుట్టుకు సహజ కండిషన్స్ అందిస్తుంది.
సిట్రస్ పండ్లు
నిమ్మకాయలు,నారింజ, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి, కొల్లాజెన్ జుట్టును బలోపేతం చేస్తాయి. హెయిల్ ఫోలికల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
బ్లూబెర్రీస్
బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి ఉన్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచి పెరగుదలలో సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఆహారంలో యాంటీఆక్సిడెంట్ పండ్లను చేర్చుకుంటే జుట్టు డ్యామేజ్ తగ్గుతుంది.
దానిమ్మ
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ జుట్టును బలంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తాయి.