మనలో చాలా మందికి టీ తాగడమంటే ఇష్టం. కొందరికి కప్పు టీ లేకుంటే రోజు ప్రారంభం కాదు.

అయితే కొంతమంది టీతో పాటు అనేక రుచికరమైన స్నాక్స్‌ను ఆనందిస్తారు.
అయితే టీతో పాటు కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా.. వాటి గురించి తెలుసుకుందాం.
టీతో పాటు పకోడి తినకూడదు. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. ఎసిడిటీ సమస్య ప్రారంభమవుతుంది.
టీతో పాటుగా పసుపుతో చేసిన ఆహారాలు తినకూడదు. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు ఎదురవుతాయి.
టీతో చల్లటి పదార్థాలు తినడం మంచిదికాదు. చల్లటి, వేడి కలయిక ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల అజీర్తి సమస్య ఏర్పడుతుంది.
వేడి టీతో పాటు గ్రీన్ వెజిటేబుల్స్ తినడం మంచిదికాదు. టీలో టానిన్, ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరం నుంచి ఇనుముని బయటికి పంపిస్తుంది.
చాలా మంది ఫిట్‌గా ఉండేందుకు లెమన్‌ టీ తాగుతుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది.
నిజానికి నిమ్మకాయలో సిట్రస్ ఉంటుంది. ఇది ఛాతిలో మంటని, కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది.