వర్షాకాలం వచ్చిందంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి స్వాగతం పలుకుతుంటాయి. వీటిని తప్పించుకోవాలంటే ఈ సూపర్ డ్రింక్స్ తాగాల్సిందే.
ఊసిరి
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరిని జ్యూస్ లేదా ఉసిరి ఆధారిత పానీయాలను తీసుకుంటే ఇమ్యూనిటి పెరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
అల్లం టీ
అల్లం చాయ్ లో ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇమ్యూనిటీ పెంచుతాయి. జీర్ణక్రియకు సహాయపడుతుంది. వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చికెన్
చికెన్ సూప్ వర్షాకాలంలో ఎంతో మేలు చేస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచతుంుది. వర్షాకాలంలో వెచ్చదనాన్ని అందిస్తుంది.
దాల్చిన చెక్క టీ
దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వేడి నీటిలో దాల్చిన చెక్క ఉడకబెట్టి తీసుకోవచ్చు.
మెంతుల నీళ్లు
మెంతిగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి తెల్లవారు గోరువెచ్చగా చేసుకుని తాగాలి. జీవక్రియకు సహాయపడుతుంది.
ఆరెంజ్ జ్యూస్
తాజా ఆరెంజ్ జ్యూసులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.