కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ఇందులో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం నుంచి అదనపు నీటిని, టాక్సిన్స్ ను తొలగిస్తుంది.
కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాలేయాన్ని హెల్తీగా ఉంచుతాయి.
కొబ్బరినీళ్లు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. పేగు కదలికలను సులభం చేస్తుంది. మలబద్దకం సమస్యకు కొబ్బరి నీళ్లతో చెక్ పెట్టవచ్చు.
ఎసిడిటితో బాధపడేవారికి కొబ్బరి నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి.
2013 అధ్యయనం ప్రకారం కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కొంటాయి. ఇమ్యూనిటినీ బలోపేతం చేస్తాయి. అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.
గర్భిణీలకు కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని నిపుణులు చెబుతుంటారు. కొబ్బరి నీళ్లలో ఉండే విటమిన్ బి 9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వేధించే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
షుగర్ పేషంట్లు కొబ్బరి నీళ్లు తాగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయన్న అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు.
ఇందులోని పోషకాలు రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.