చలికాలంలో ఎక్కువగా తినాల్సిన ఆకుకూరలు ఇవే

ఆకు కూరలు
చలికాలంలో పచ్చికూరగాయలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో తినాల్సిన ఆకుకూరలు ఏవో ఇప్పుడు చూద్దాం.
బచ్చలికూర
బచ్చలికూరలో విటమిన్ కె, విటమిన్ ఎ, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఐరన్ లోపాన్ని తగ్గిస్తాయి.
ఇమ్యూనిటి
మన శరీరం బలంగా ఉండాలంటే ఇమ్యూనిటీ బాగుండాలి. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే ఆకుకూరలు తినాలి.
ముల్లంగి ఆకులు
చలికాలంలో ముల్లంగి ఆకులు తింటే జీర్ణవ్యవస్థతోపాటు జలుబు, దగ్గు వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మెంతికూర
మెంతులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెంతి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో ఫైబర్, ఐరన్, విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి.
జీర్ణక్రియ
మెంతులు, మెంతి ఆకులు తింటే ఇమ్యూనిటీని పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
మలబద్ధకం
మెంతిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో వీటిని తినడం వల్ల శరీర నొప్పులు, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆవ ఆకులు
ఆవఆకుల్లో ప్రొటీన్లు, ఫైబర్ తోపాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు ఎక్కువగా తింటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు.