ప్రధాని మోడీ బాల్యం నుంచి పీఎం వరకూ జీవితంలోని విశేషాలు ఇవే
ప్రధాని నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ రాష్ట్రంలోని వాద్‌నగర్‌లో దామోదర్ దాస్ మూల్‌చంద్ మోడీ, హీరాబెన్ దంపతులకు జన్మించారు. ఐదుగురు తోబుట్టువుల్లో మోదీ మూడో సంతానం.
మోడీ తండ్రికి వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో టీ దుకాణం ఉండేది. అతను తన చిన్నతనంలో తన తండ్రికి సహాయం చేసేవాడు.
నరేంద్ర మోదీ ప్రాథమిక విద్యాభ్యాసం వాద్‌నగర్‌లోని భగవాచార్య నారాయణాచార్య పాఠశాలలో జరిగింది. మోడీ అమెరికాలో మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్‌కు సంబంధించిన 3 నెలల కోర్సు చేశారు.
18 సంవత్సరాల వయస్సులో, నరేంద్ర మోడీ బనస్ కంతా జిల్లాలోని రాజోసనా గ్రామంలో నివసించే జశోదా బెన్‌తో అతని వివాహం జరిగింది.
మోదీకి చిన్నప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉంది. 1958లో దీపావళి రోజున, గుజరాత్ ఆర్‌ఎస్‌ఎస్ మొదటి ప్రాంతీయ ప్రచారక్, లక్ష్మణ్ రావు ఇనామ్‌దార్ అలియాస్ వకీల్ సాహెబ్ ద్వారా ఆర్ఎస్ఎస్ లో చేరారు.
1971లో మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌కు పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. రైళ్లు, బస్సుల్లో ఆర్‌ఎస్‌ఎస్ నేతల రిజర్వేషన్‌కు ఆయనే బాధ్యత వహించారు.
వైవాహిక జీవితం విడిచిపెట్టి నరేంద్రమోడీ ఇల్లు వదిలి సంఘ్ ప్రచారక్ అయ్యారు. అతను అహ్మదాబాద్ సంఘ్ ప్రధాన కార్యాలయంలో నివసించారు.
లాల్ కృష్ణ అద్వానీని నరేంద్ర మోడీ రాజకీయ గురువుగా పరిగణిస్తారు. 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు అద్వానీ చేపట్టిన రథయాత్రలో మోదీ పెద్ద పాత్ర పోషించారు.
నరేంద్ర మోడీ 1985లో బిజెపిలో చేరారు. 2001 వరకు పార్టీలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. 2001లో మోదీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ కీలక పాత్ర పోషించారు. తొలిసారి పూర్తి మెజారిటీతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోదీ దేశానికి ప్రధాని అయ్యారు.