కొన్ని జంతువులు కాలానుగుణంగా జీవిస్తుంటాయి. కఠినమైన చల్లని వాతావరణంలోనూ జీవిస్తాయి. అత్యంత శీతల పరిస్థితుల్లో జీవించగల 5 జంతువులు ఏవో చూద్దాం.
పెంగ్విన్స్
పెంగ్విన్స్ మందపాటి నలుపు, తెలుపు పొరలను కలిగి ఉంటాయి. అంటార్కిటికాలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలవు.
మంచు గుడ్లగూబ
ఈ అందమైన పక్షి అతిశీతలమైన అర్కిటిక్ ప్రాంతంలో నివసిస్తుంది. ఉత్తర యూనైటెడ్ స్టేట్స్, యూరప్, ఆసియాలోనూ ఉంటాయి.
పోలార్ బేర్స్
వీటిని ధ్రువపు ఎలుకు బంటి అని పిలుస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎలుగుబంట్లు, ఆర్కిటిక్ సర్కిల్ శీతల వాతావరణంలో జీవిస్తాయి. వాతావరణం మార్పుల వల్ల వాటి జాతులు అంతరించి పోతున్నాయి.
మంచు చిరుతలు
మధ్య ఆసియాలోని ఎత్తైన పర్వతాల్లో కనిపించే మంచు చిరుతపులులు, బూడిద, తెలుపు రంగు చారలను కలిగి ఉంటాయి. ఇవి మైనస్ డిగ్రీల్లో నూ జీవిస్తాయి.
వాల్రస్
వాల్రస్ అనేది ఆర్కిటిక్ లో గడ్డకట్టే పర్యావరణ వ్యవస్థలో నీటిలో జీవిస్తుంది. కానీ ఇప్పుడు వీటిని సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.