వేసవిలో మామిడి పండ్లు తింటే కలిగే అద్భుతాలివే..!

మామిడి పండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం, అరుగుదల సరిగా లేకపోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
మామిడి పండులో వుండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
చర్మము ఆరోగ్యాన్ని పెంచడానికి మామిడిపండ్లు తోడ్ప‌డుతాయి.
మామిడి పండ్ల‌లో ఐర‌న్‌ సమృద్దిగా లభిస్తుంది.
మామిడి పండ్లలో శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించే అనేక విటమిన్లు ఉంటాయి.