తనంటే నాకెంతో ఇష్టం. మా రిలేషన్ చాలా డిఫరెంట్ అంటూ తమన్నా తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెబుతోంది.
తమన్నా, శ్రుతి హాసన్ చాలా మంచి స్నేహితులని అందరికీ తెలిసిందే. ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేసుకుంది తమన్నా.
తమన్నా కొంచెం నిరుత్సాహంగా ఉందంటే.. వెంటనే శ్రుతి హాసన్‌కి ఫోన్ చేసి మాట్లాడాల్సిందేనంట.
శ్రుతి హాసన్ నాకు స్ఫూర్తి అని చాలా సందర్భాల్లో వెల్లడించింది తమన్నా. ఖాళీ ఉంటే ఒకరింటికి ఒకరు వెళ్తుంటారంట. ఇద్దరూ కలిస్తే.. చిన్నపిల్లల్లా మారిపోయి తెగ అల్లరి చేస్తుంటారంట.
తమన్నా మనసు బాగోలేకపోతే శ్రుతి హాసన్‌కి ఫోన్ చేసి, అంత ఉత్సాహంగా ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుంటుందంట.
అలాగే శ్రుతి తన ఇంటిని తనే చక్కగా తీర్చిదిద్దుకుంటుందని, కెరీర్ పరంగా ఎంతగానో కష్టపడుతుందని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందని తమన్నా చెప్పుకొచ్చింది.
అలాగే అభిమానులతో సరదాగా మాట్లాడుతుందని, ఇలా ఎప్పుడూ హుషారుగా ఉండటం చాలా కష్టమంటూ తన ఫ్రెండ్ గురించి వెల్లడించింది తమన్నా.
తమన్నా ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’, ‘ఎఫ్ 3’, ‘సీటీమార్’, ‘అందాధూన్’ చిత్రాల్లో నటిస్తోంది. క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలతో విజయాలను తన ఖాతాలోవేసుకుంది శ్రుతి హాసన్.