కరోనా సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోతుందని అనుకుంటే.. థర్డ్ వేవ్ తో పిల్లలకు ప్రమాదం ముంచుకొస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు.
పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం..
1. కొబ్బరినీళ్లు...
విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. డీహైడ్రేషన్ నుంచి కాపాతాయి. శక్తితో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చిన్నారులతో రోజూ తాగిస్తే చాలా మంచిది.
2. బాదం...
విటమిన్ ఇ, మాంగనీస్ బాదంలో ఎక్కువగా ఉంటుంది. వ్యాధులను దరికి చేరకుండా చేయడంలో దిట్ట. రోజూ రాత్రి నానబెట్టిన 6 లేదా 7 బాదం పప్పులను ఉదయాన్నే పిల్లలతో తినిపించాలి. ఇలా చేస్తే కొత్తకణాల ఉత్పత్తి కావడంతోపాటు శక్తినీ పెంచుతాయి.
3. గోల్డ్మిల్క్...
గోరువెచ్చని పాలల్లో చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసి రోజూ ఒకసారైనా తాగించాలి. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
4. చిరుధాన్యాలు..
వారానికి ఒకటి లేదా రెండు సార్లు చిరుధాన్యాల కిచిడీని తినిపించాలి. వీటికి కూరగాయల ముక్కలు యాడ్ చేస్తే మరీ మంచిది. అలాగే చిరు ధాన్యాలతో బిస్కట్లు చేసి ఇచ్చినా పోషకాలు, పీచు పిల్లలకు అందుతాయి.
5. సలాడ్స్...
పిల్లలు స్నాక్స్ కావాలనప్పుడల్లా తాజా పండ్లు లేదా కూరగాయల సలాడ్స్‌ను అందించాలి. అలాగే పాప్ కార్న్, బ్రెడ్, గుడ్లు, కూరగాయలతో కలిపి శాండ్ విచ్లు చేసి ఇస్తే ఇష్టంగా తింటారు.