2020 లో టాలీవుడ్ పెళ్లిళ్లు

దగ్గుబాటి రానా ప్రేమ పెళ్లి..
ఎప్పటినుంచో వాయిదా వేస్తూ వస్తున్న దగ్గుబాటి రానా పెళ్లి తన చిన్ననాటి స్నేహితురాలు మిహికా బజాజ్ తో ఆగస్టు 3 వ తేదీన రామానాయుడు స్థూడియోస్ లో చాలా సింపుల్ గా జరిగింది.
నితిన్ ప్రేమ వివాహం..
టాలీవుడ్ యువ హీరో నితిన్ ఈ సంవత్సరం ఒక ఇంటివాడయ్యాడు. శాలిని అనే అమ్మాయితో కొంతకాలంగా ప్రేమలో మునిగి ఉన్న నితిన్.. జూలై నెలలో హైదరాబాద్‌లోని ఫలక్‌నూమా ప్యాలెస్ లో కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచేశారు.
డాక్టరమ్మను పెళ్లాడిన హీరో నిఖిల్!
హీరో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మను మే 14 వ తేదీన తన పామ్ హౌస్ లో పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యారు.
స్నేహితునితో చందమామ పెళ్లి
టాలీవుడ్ చందమామ ఈ సంవత్సరం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్నారు. ముంబై లోని తాజ్ హోటల్లో నవంబర్ నెలలో ఈ జంట ఒకటైంది.
మెగా డాటర్ నీహారికా పెళ్లి
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ.. నీహారిక వివాహం డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. కోవిడ్ నిబంధనలు సడలించడంతో ఉదయ్ పూర్ లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. మెగా కుటుంబం అంతా హాజరైన ఈ వేడుక మూడురోజుల పాటు అట్టహాసంగా సాగింది.