రామ నైవేద్యం.. పానకం

కావాల్సినవి: బెల్లం పొడి - పావు కేజీ
నీళ్లు: లీటర్
యాలుకల పొడి: టీ స్పూన్
మిరియాల పొడి: టీ స్పూన్
శొంఠి పొడి: చిటికెడు
తయారీ: బెల్లం పొడి లో నీటిని కలిపి కరిగిన తరువాత వడపోయాలి. ఈ బెల్లం నీటిలో యాలుకల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి కలిపితే పానకం రెడీ.
వడపప్పు
కావాల్సినవి: పెసరపప్పు - పావు కేజీ
పచ్చిమిర్చి - ఒకటి
పచ్చి కొబ్బరి తురుము - టేబుల్ స్పూన్
మామిడికాయ తురుము - టేబుల్ స్పూన్
తయారీ: పెసరపప్పు శుభరంగా కడిగి అరగంట నానపెట్టాలి గింజ మెత్తబడిన తరువాత నీటిని వంపేసి అందులో పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, మామిడికాయ తురుము కలిపితే వడపప్పు రెడీ.