శోభిత ధూళిపాళ్ళ… ఇప్పుడు తెలుగు మీడియాలో ట్రెండింగ్ నేమ్

టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో శోభితకు ఎంగేజ్మెంట్ అయిందనే వార్త బయటకు రావడంతో ఆమె గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది
జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శోభిత 1992 మే 31న తెనాలిలో జన్మించారు
విశాఖలో కొంతకాలం చదువుకున్న తరువాత ఆమె కార్పొరేట్ లా చదివేందుకు ముంబయి వెళ్ళారు
విశాఖలో ప్రతి ఏటా జరిగే నేవీ బాల్ వేడుకల్లో 2010లో పాల్గొన్నారు. అప్పుడు ఆమె నేవీ క్వీన్ కిరీటాన్ని గెల్చుకుని తొలిసారిగా వార్తల్లోకెక్కారు
శోభిత 2013లో ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెల్చుకోవడంతో తొలిసారిగా వార్తల్లోకెక్కారు
ఆ విజయం ఆమెకు మాడలింగ్ రంగంలో అవకాశాలకు తలుపులు తెరిచింది
మాడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.
అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రమణ్ రాఘవ్ శోభిత నటించిన తొలి చిత్రం
ఆ తరువాత తెలుగులో అడివి శేషుతో కలిసి గూఢచారి చిత్రంలో నటించారు
2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వచ్చిన హెవెన్ వెబ్ సిరీస్ నటిగా ఆమె కెరీర్ ను కొత్త మలుపు తిప్పింది
మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ లో శోభిత కీలక పాత్ర పోషించారు