గుండె ఆరోగ్యం

ప్రతిరోజూ బాదం తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె పదిలంగా ఉంటుంది.
బరువు నియంత్రణ
ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి అతిగా తినకుండా చేసి బరువు తగ్గిస్తాయి.
షుగర్ కంట్రోల్
నానబెట్టిన బాదం ఇన్సులిన్ నిరోధకతను పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా అదుపు చేస్తుంది.
బిపికి చెక్
బాదంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటు (బీపీ)ని అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.
చర్మ సంరక్షణ
విటమిన్-ఈ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుస్తుంది.
మెదడు చురుకుదనం
బాదంలోని ఫోలేట్, విటమిన్-ఈ మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడతాయి.
జీర్ణక్రియ సమర్థవంతం
ఇందులో లభించే అధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది.
జుట్టు ఆరోగ్యం
బాదంలో ఉండే ప్రోటీన్, విటమిన్-ఈ కుదుళ్లను బలంగా మార్చి, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
తక్షణ శక్తి
ప్రతిరోజూ ఉదయం బాదం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన తక్షణ ఎనర్జీ లభించి రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
తీసుకునే విధానం
రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదంను ఉదయాన్నే పొట్టు తీసి తినడం వల్ల శరీరానికి పూర్తి పోషకాలు లభిస్తాయి.