ప్రతిఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో సీతాఫలాలు విరిగా కాస్తాయి.
ఈ పండు ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాదు ఇది ఆరోగ్యానికి దివ్యౌషధం అని కూడా చెప్పుకోవచ్చు. సీజన్ లో మాత్రమే లభించే ఈ పండును కచ్చితంగా తినాలి.
దానిమ్మ, బత్తాయి వంటి వాటిని ప్రత్యేకంగా పెంచాల్సి వస్తుంది. కానీ సీతాఫలాలు మాత్రం వాటంతట అవే కాస్తాయి. ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయితే ఈ చెట్లు ప్రతిచోటా ఉంటున్నాయి.
సీతాఫలం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. సీతాఫలంలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మనశరీరంలోని వ్యర్థాలను బయటకు తరిమికొడతాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
సీతాఫలాల్లో ఎంతో మేలు చేసే విటమిన్ సి ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటివి కూడా మన గుండెకు మేలు చేస్తాయి. అందుకే సీతాఫలాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.
సీతాఫలం తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ పండ్లలోని విటమిన్ ఎ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. మలబద్దకంతో బాధపడేవారు సీతాఫలం తింటే జీర్ణం అవుతుంది.
సీతాఫలంలోని మెగ్నీషియం మన శరీరంలోని వాటర్ లెవల్స్ ను క్రమబద్ధీకరిస్తుంది. కీళ్లలోని యాసిడ్స్ ను బయటకు తరిమేసి, రుమాటిజం, కీళ్ల నొప్పులకు చెక్ పెడుతుంది. నీరసంగా, అలసిపోయినట్లుగా అనిపిస్తే వెంటనే సీతాఫలం తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
రక్తహీనతతో బాధపడేవారు సీతాఫలం తింటే మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలంటే కూడా సీతాఫలం తినవచ్చు. ఇందులో సహజ చక్కెర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గర్భిణీలు కూడా సీతాఫలం తినవచ్చు. పిల్లలు పుట్టే సమయంలో నొప్పులను నివారించే గుణం సీతాఫలంలో ఉంది.