పోషకాల గని :

జామకాయలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
సరైన విధానం ముఖ్యం :
జామకాయ తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో.. దాన్ని తిన్న తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.
పాలు, పాల ఉత్పత్తులు వద్దు :
జామకాయ తిన్న వెంటనే పాలు లేదా పాలతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. జామలోని సహజ ఆమ్లాలు పాలతో కలిస్తే జీర్ణక్రియ మందగిస్తుంది.
కడుపు ఉబ్బరం సమస్య :
జామకాయ, పాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, తీవ్రమైన అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
వెంటనే చల్లటి నీళ్లు తాగకండి :
చాలామందికి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ జామకాయ తిన్న వెంటనే చల్లటి నీరు తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది.
30 నిమిషాల గ్యాప్ ఇవ్వండి :
జామకాయ తిన్న తర్వాత కడుపు నొప్పి, అసౌకర్యం రాకుండా ఉండాలంటే కనీసం 20 నుంచి 30 నిమిషాల విరామం ఇచ్చిన తర్వాతే నీళ్లు తాగాలి.
అరటిపండ్లతో కలిపి తినవద్దు :
జామకాయ, అరటిపండు విడివిడిగా మంచివే కానీ.. ఈ రెండింటిని ఒకేసారి కలిపి తింటే కొంతమందిలో తీవ్రమైన కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి.
మసాలా, నూనె పదార్థాలకు దూరం :
జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న వెంటనే బిర్యానీలు, మసాలా లేదా నూనెతో చేసిన ఫుడ్ తింటే జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది.
గుండెల్లో మంట :
జామకాయ తిన్న వెంటనే హెవీ మసాలా ఫుడ్స్ తీసుకోవడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట, కడుపులో తీవ్ర అసౌకర్యం కలగవచ్చు.
నిపుణుల సూచన :
ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరుగా ఉంటుంది. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు జామకాయ తిన్నాక కాస్త గ్యాప్ ఇచ్చి ఇతర ఆహారాలు తీసుకోవడం మంచిది.