వాడిన మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని సైబర్ మోసాలకు ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
2) ప్లాస్టిక్ వస్తువులతో ఆకర్షణ
కొంతమంది వ్యాపారులు పాత ఫోన్లకు బదులుగా ప్లాస్టిక్, స్టీల్ పాత్రలు ఇస్తామని ఇళ్ల వద్దకు వస్తుంటారు. ఈ ఆకర్షణకు లోనై ఫోన్ వివరాలు నమోదు చేయకుండానే విక్రయించకూడదు.
3) ఇతర రాష్ట్రాలకు తరలింపు
సేకరించిన మొబైళ్లను కొన్ని ముఠాలు ఇతర ప్రాంతాలకు తరలించి, మరమ్మతులు చేయించి నేర కార్యకలాపాలకు సిద్ధం చేస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
4) నకిలీ సిమ్‌లతో మోసాలు
పాత ఫోన్లలో నకిలీ గుర్తింపు వివరాలతో పొందిన సిమ్ కార్డులు అమర్చి, వాటి ద్వారా మోసపూరిత కాల్స్, ఇతర సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.
5) ఐఎంఈఐ నంబరుతో గుర్తింపు
ప్రతి మొబైల్‌కు ప్రత్యేకమైన IMEI నంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నేరాల్లో ఉపయోగించినప్పుడు దర్యాప్తు సంస్థలు ఈ నంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తాయి.
6) అమ్మిన వ్యక్తికీ విచారణ తప్పదు
నేరానికి ఉపయోగించిన ఫోన్ గతంలో ఎవరి వద్ద ఉందనే వివరాలను పోలీసులు పరిశీలించవచ్చు. సరైన విక్రయ ఆధారాలు లేకపోతే పాత యజమాని కూడా విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చు.
7) ఫోన్ విక్రయానికి రసీదు తప్పనిసరి
మొబైల్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి పేరు, చిరునామా, గుర్తింపు వివరాలు నమోదు చేసుకోవాలి. ఫోన్ IMEI నంబర్, విక్రయించిన తేదీతో కూడిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి.
8) వ్యక్తిగత సమాచారం తొలగించాలి
ఫోన్ అమ్మే ముందు సిమ్ కార్డు, మెమరీ కార్డు తీసేయాలి. ఫొటోలు, వీడియోలు, కాంటాక్టులు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని బ్యాకప్ తీసుకున్న తర్వాత సురక్షితంగా తొలగించాలి.
9) బ్యాంకింగ్ వివరాలు బయటపడకుండా
యూపీఐ యాప్‌లు, బ్యాంకింగ్ యాప్‌లు, ఈమెయిల్, సోషల్ మీడియా ఖాతాల నుంచి లాగ్ అవుట్ కావాలి. ఫ్యాక్టరీ రీసెట్ చేసి ఫోన్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే విక్రయించాలి.
10) గుర్తింపు పొందిన డీలర్లకే విక్రయించండి
తెలియని వ్యక్తులకు లేదా వీధుల్లో తిరుగుతూ ఫోన్లు సేకరించే వారికి మొబైల్ ఇవ్వకుండా గుర్తింపు ఉన్న రీసైక్లింగ్ కేంద్రాలు, విశ్వసనీయ డీలర్లను ఆశ్రయించాలి. విక్రయానికి సంబంధించిన ఆధారాలను భద్రపరుచుకోవాలి.