చర్మ ఆరోగ్యానికి రోజ్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. సువాసన, రిఫ్రెష్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవన్నీ చర్మానికి మెరుపును తీసుకువస్తాయి. రోజ్ వాటర్ లో శక్తివంతమైన సహజ పదార్థాలు స్కిన్ గ్లో పెంచుతాయి.
తేలికపాటి క్లెన్సర్ తో రోజ్ వాటర్ ను కలిపి ముఖానికి ఫేస్ వాష్ లా వాడొచ్చు. ఇది ముఖంపై ఉన్న మురికిని తొలగిస్తుంది. చర్మాన్ని ప్రకాశంగా మారుస్తుంది.
రోజ్ వాటర్ అద్భుతమైన నేచురల్ టోనర్ గా తయారువుతుంది. ఇది సున్నితమైన ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.
చర్మంపై రంధ్రాలు, చర్మం పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాటన్ ప్యాడ్ పై కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి ముఖం మీద స్వైప్ చేయాలి.
రోజ్ వాటర్ తో స్ప్రే బాటిల్ ను నింపి రిఫ్రెష్ ఫేషియల్ మిస్ట్ ను తయారు చేయాలి. ఇది మీ చర్మాన్ని రీహైడ్రేట్ చేయడానికి, ముఖంపై మెరుపును ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
తేనె లేదా పెరుగుతో సహాపదార్థాలతో రోజ్ వాటర్ కలిపి..మీ చర్మం మాస్క్ వేసుకోవాలి. ముఖంపై ఎరుపు, మంటను తగ్గిస్తుంది.
రోజ్ వాటర్ ను కాటన్ ప్యాడ్ కు అప్లై చేసి కళ్లపై మర్దన చేయాలి. కళ్లు ఉబ్బడం, నల్లటి వలయాలను తగ్గిస్తుంది.
రోజ్ వాటర్ లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అలసిపోయిన కళ్లకు ఉపశమనం కలిగించి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.