రియల్ మీ GT 5G

120Hz రిఫ్రెష్ రేటుతో 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే తో ఈ ఫోన్ విడుదలైంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.
స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ ను ఈ ఫోన్‌లో ఉపయోగించారు.
వెనుక వైపు 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ వైడ్‌ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరాల సెటప్ ఉంది.
సెల్ఫీల కోసం ముందుభాగంలో 16ఎంపీ కెమెరా అమర్చారు.
4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ తో వచ్చిన ఈ ఫోన్.. 65వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
8జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ మెమొరీ, 12జీబీ ర్యామ్‌/256జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
భారత్‌లో సుమారు రూ.39,000 ఉంటుందని అంచనా. డాషింగ్ బ్లూ, డాషింగ్ సిల్వర్‌, రేసింగ్ ఎల్లో రంగులో ఈ ఫోన్‌ లభించనుంది.