Rajma Benefits: ఈ గింజల్లో మటన్, చికెన్ కంటే ఎక్కువ పోషకాలు..డైట్లో ఉండాల్సిందే
రాజ్మా గింజలను కిడ్నీ బీన్స్ అనికూడా పిలుస్తుంటారు. శరీరంలో కిడ్నీల ఆకారంలో ఉంటాయి. అందుకే వీటిని కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు.
వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ గింజల్లో విటమిన్ ఇ, కె, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలతోపాటు ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఈ రాజ్మా గింజలు నలుపు, ముదురు ఎరుపు, లేత ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
షుగర్ పేషంట్లకు రాజ్మా గింజలు వరంగా చెప్పవచ్చు. ఇవి శరీరంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. చక్కెర వ్యాధిని తగ్గిస్తాయి.
షుగర్ తో బాధపడేవారు రాజ్మాను డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. కిడ్నీ బీన్స్ లో ఎక్కువ శాతం ప్రొటీన్లు, ఫైబర్, కొలెస్ట్రాలో తక్కువ మోతాదులో ఉంటుంది.
కిడ్నీ బీన్స్ శరీరాన్ని అనేక ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. శరీరానికి హాని చేసే టాక్సిన్స్ ను శరీరం నుంచి బయటకు పంపించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక మంచి డైట్ అని చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.