PV Sindhu: ‘బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్స్‌’ అంబాసిడర్‌గా సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధును అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఓ గౌరవాన్ని అందించింది.
ఐఓసీ ప్రచార కార్యక్రమంలో ‘బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్స్‌’కు అంబాసిడర్‌గా సింధును ఎంపిక చేసింది. సింధుతో పాటు కెనడా షట్లర్‌ మిషెల్లీ లీ కూడా అంబాసిడర్‌గా ఎంపికైంది.
ఐఓసీ ప్రచారంలో భాగంగా సింధు, లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న షట్లర్లతో సోషల్‌ మీడియా ద్వారా సంభాషిస్తారు.
క్రీడల్లో అత్యుత్తమంగా ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశంపై తమ సూచనలు, సలహాలు ఇస్తారు.
ఆటలో భాగంగా ఉంటూ తప్పుడు మార్గాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదాల నుంచి ఎలా దూరంగా ఉండాలనే అంశంపై మార్గనిర్దేశనం చేస్తారు.