న్యూట్రిషన్ పవర్‌హౌస్:

గుమ్మడి గింజల్లో విటమిన్ కె, విటమిన్ ఇ, బి-కాంప్లెక్స్‌తో పాటు మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
వెన్నెముకకు బలం:
ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల మరమ్మత్తుకు తోడ్పడటమే కాకుండా వెన్నెముకను బలంగా మారుస్తాయి.
గుండెకు రక్షణ:
ఈ గింజల్లో ఉండే మోనో, పాలి అన్‌శాచురేటెడ్ మంచి కొవ్వులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
నడుము నొప్పికి చెక్:
వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కీళ్లను దృఢంగా చేస్తాయి. నడుము నొప్పితో బాధపడేవారు వీటిని తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
మెదడు చురుగ్గా:
గుమ్మడి గింజల్లో లభించే జింక్, మెగ్నీషియం మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
ప్రశాంతమైన నిద్ర:
ఇందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రాత్రి వేళల్లో నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.
బరువు నియంత్రణ:
ఈ గింజలను స్నాక్స్‌గా తింటే ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీనివల్ల అతిగా తినడం తగ్గి, సులభంగా బరువు అదుపులోకి వస్తుంది.
ఎలా తినాలి?:
వీటిని నేరుగా స్నాక్స్‌లా కాకుండా సలాడ్లు, స్మూతీలు, సూప్‌లలో కలుపుకుని కూడా ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.
ఆక్సీకరణ ఒత్తిడి దూరం:
గుమ్మడి గింజలలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.
వీరు తినకూడదు:
పోషకాలు ఉన్నప్పటికీ.. అలర్జీలు, బీపీ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.