కోహ్లీ భారత్ జట్టుకు 60 టెస్టు మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. కోహ్లీ స్వదేశంలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో 36 విజయాలు, 14 ఓటములు భారత్ చవిచూసింది.
సౌరవ్ గంగూలీ
అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్లలో ఒకరిగా పేరు పొందిన సౌరవ్ గంగూలీ 49 టెస్ట్ మ్యాచ్‌ల్లో టీం ఇండియాకు నాయకత్వం వహించాడు. 21 విజయాలు, 13 ఓటములు ఉన్నాయి.
మహమ్మద్ అజారుద్దీన్
1990 నుండి 1999 వరకు అజారుద్దీన్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. మెుత్తం 47 టెస్ట్‌ల్లో 14 విజయాలు ఉండగా 14 ఓటములు ఉన్నాయి.
సునీల్ గవాస్కర్
సునీల్ గవాస్కర్ ఆధ్వర్యంలో భారత్ 47 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. కేవలం 9 గెలిచి 30 టెస్టులు డ్రాగా ముగిశాయి.
పటౌడీ
పటౌడీకి చెందిన నవాబ్ 13 సంవత్సరాలు టీమిండియాకు నాయకత్వం వహించాడు. అతని రికార్డు: టెస్టులు: 40, గెలుపు: 9, ఓటమి: 19.
కపిల్ దేవ్
ఇక కపిల్ దేవ్ నాయకత్వంలోని టిమిండియా 34 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు సాధించగా..7 ఓటములు పొందింది.
రాహుల్ ద్రవిడ్
ది వాల్ రాహుల్ ద్రవిడ్.. సౌరవ్ గంగూలీ రిటైర్ తర్వాత టీమిండియా నాయకత్వం వహించారు. 25 టెస్ట్ మ్యాచ్‌లో 8 విజయాలను, 6 ఓటములను భారత్ చవిచూసింది.
సచిన్ టెండూల్కర్
అత్యుత్తమ బ్యాట్స్మన్లలో ఒకరైన సచిన్ కు కెప్టెన్‌గా గొప్ప రికార్డు లేదు. 25 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించగా.. కేవలం 4 విజయాలు, 9 ఓటములతో సక్సెస్ పుల్ కెప్టెన్ కాలేకపోయాడు.
టెస్ట్ క్రికెట్ లో అత్యధికసార్లు నాయకత్వం వహించిన టీమిండియా కెప్టెన్లు