అరకప్పు నీటిలో ఓ అంగుళం పసుపు కొమ్మును వేసి నీరు సగం అయ్యే వరకూ ఉడికించండి. 8 తులసి ఆకులు, 6 బాదంలు, 6 లేదా 8 ఎండు ద్రాక్ష, ఓ కప్పు పాలు వెయ్యండి. పెద్ద మంటపై ఉడికించి, తరవాత మంట తగ్గించి సిమ్లో 5 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు పావు టీస్పూన్ నల్ల మిరియాల పొడి, ఓ టీస్పూన్ తేనె వేసి బాగా కలపండి.కొద్దిగా చల్లార్చి గోరు వెచ్చగా ఉండగా తాగండి. ఇలా రోజుకు రెండుసార్లు చెయ్యండి.