బుట్టబొమ్మ పూజాహెగ్డే కు పుట్టినరోజు శుభాకాంక్షలు! తన పుట్టినరోజు సందర్భంగా పలు విషయాల గురించి పూజా అభిప్రాయాలు ఆమె మాటల్లోనే చూడండి.
మా కుటుంబానికీ సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి అనుబంధం లేదు. నాన్నగారు మంజునాథ్‌ క్రిమినల్‌ లాయర్‌. కానీ, అడ్వర్టైజ్‌మెంట్‌ రంగంలో స్థిరపడ్డారు. అమ్మ లత ఎంబీఏ చేశారు. అన్నయ్య రిషభ్‌ డాక్టర్‌. ఇంట్లో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఎవరూ లేరు.
మొదట మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్న తర్వాత మోడలింగ్‌ చేసే అవకాశాలు వచ్చాయి. అప్పుడే సినిమాల గురించి ఆలోచించాను. అలా తమిళంలో ‘ముగామూడీ’ చేశా. ఆ తర్వాత తెలుగులో ‘ఒక లైలా కోసం’ చేసే అవకాశం వచ్చింది
నేను పుట్టి, పెరిగింది అంతా కర్ణాటక మంగుళూరులోనే. రణ్‌బీర్‌తో చేసిన యాడ్‌ను అశుతోష్‌ సతీమణి చూశారు. మొహంజదారో’లోని కథానాయిక పాత్రకు నేనైతే సరిపోతానని భావించి ఆడిషన్‌కు పిలిచారు.
''చిన్నతనం నుంచి నన్ను నా కన్నా ఎక్కువగా నమ్మింది మా అమ్మే. ఇండస్ట్రీకి వస్తాననగానే ఆమ్మే నన్ను ప్రోత్సహించింది. 'నువ్వు ఎప్పుడూ వినయంగా ఉండు. ఈ రంగంలో సక్సెస్‌ నీకు తప్పక వస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్న సంగతి అస్సలు మర్చిపోవద్దు' అని చెబుతుంది. ఏ విషయంలోనైనా అమ్మే నా స్ఫూర్తి''
కడుపు మాడ్చుకుని డైటింగ్‌ చేయడమంటే నాకు ఇష్టం ఉండదు. కావాల్సిన ఆహారం తింటాను. అయితే, కొవ్వు ఎక్కువగా లేకుండా చూసుకుంటా. దాల్‌ రైస్‌ ఇష్టంగా తింటా. పిజ్జా కనిపిస్తే నోరు కట్టేసుకుని కూర్చోలేను
ఆర్యోగంగా, ఫిట్‌గా ఉండేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తా. ఇంట్లో ఉన్నా, షూటింగ్‌లో ఉన్నా రోజులో ఓ గంట వ్యాయామం చేస్తా. దేనికైకా బ్రేక్‌ ఇస్తాను కానీ, వ్యాయామానికి ఇవ్వను. నా దృష్టిలో వర్కవుట్స్‌ అనేవి ఫిట్‌గా ఉండేందుకు
రంగస్థలం’లో ఐటెం సాంగ్‌ చేశానంటే ఆ పాటకున్న ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాట నా కెరీర్‌లో బెస్ట్‌ సాంగ్‌ అన్నపేరు వచ్చింది. అలాంటి పాట మరొకటి ఉంటుందని అనుకోను