ప్రముఖ క్యాబ్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ ఏడాది చివర్లో ఓలా విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఇవే!
మార్కెట్లోకి ఎప్పుడు రానుంది?
2010 లో క్యాబ్ సర్వీస్‌తో మార్కెట్లోకి వచ్చింది ఓలా కంపెనీ. 2021 రెండో అర్థ భాగంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
స్కూటర్ ఫొటోలు విడుదలయ్యాయా?
అవును, ఓలా ఎలక్ట్రిక్ బైక్ అధికారిక ఫొటోలను ఇటీవల విడుదల చేసింది.
ఎక్కడ తయారు చేస్తున్నారు?
ఓలా కంపెనీ తమిళనాడులోని కృష్ణగిరి వద్ద 500 ఎకరాలతో టూ వీలర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తుంది. ఏడాదికి 2 మిలియన్ యూనిట్లను సామర్ధ్యంతో ప్రతి 2 సెకన్లకు ఓ స్కూటర్‌ను ఉత్పత్తి చేయగలదు.
బడ్జెట్ మోడలా? ప్రీమియం రేంజా?
స్కూటర్ డిజైన్ చూసేందుకు చాలా సింపుల్ గా ఉన్నా..ప్రీమియం రేంజ్ లోనే తీసుకొస్తున్నట్లు సమాచారం. పెద్దగా స్టిక్కర్స్ వేయకుండా క్లీన్‌గా మరియు ఆర్గానిక్ లుక్ ఇచ్చారు.
స్టోరేజ్ విషయమేంటి?
ఈ స్కూటర్ ఆప్రాన్లో రెండు క్యూబీ హోల్స్ ఇచ్చారు. అలాగే లగేజ్ సపోర్ట్ కోసం ఒక హుక్‌ను అందించారు. అండర్ సీట్లోనూ స్టోరేజ్ కోసం బాక్స్ ఉంది.
ప్రత్యేకతలేంటి?
ఓలా స్కూటర్ జియో-ఫెన్సింగ్, నావిగేషన్, స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే ముందు 7 అంగుళాల టచ్ స్క్రీన్ అందించారు. ఈ స్ర్కీన్ లో మ్యూజిక్‌నే కాదు ఇన్ కమింగ్ కాల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు.
పనితీరు?
ఈ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో 0.45 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని ఓలా పేర్కొంది. ప్రముఖ ఎలక్ట్రికల్ బైక్ అథేర్ 450 ఎక్స్‌కు చాలా దగ్గది పోలికలు ఉన్నాయి.
బ్యాటరీ ఫిక్స్డా? మార్చుకోవచ్చా?
దీనిలో 1.155 కిలోవాట్ల సామర్థ్యం గల మూడు బ్యాటరీలు ఉన్నాయి. వీటిని రిమూవబుల్ చేయవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే 3 బ్యాటరీలతో దాదాపు 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. మిగతా స్కూటర్లతో పోల్చితే ఇది ఖచ్చితంగా ఎక్కువే.
ధర ఎంత?
ఓలా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ధర సుమారు రూ. 1.35 లక్షలు. ఇది బజాజ్ చేతక్, అథేర్ 450 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ లకు గట్టి పోటీని ఇస్తుంది.
ఇతర వివరాలు...
ఇది పర్మినెంట్ మాగ్నెట్ సింక్రనొస్ (PMS) మోటారుతో వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇది వెనుక చక్రానికి పవర్‌ని పంపుతుంది. దీంతో స్కూటర్ త్వరగా స్పీడ్ ను అందుకుంటుందంటున్నారు. అలాగే క్లౌడ్ కనెక్టివిటీని కూడా అందిస్తారని తెలుస్తోంది.