19 బంతుల్లో శాంసన్‌ హాఫ్ సెంచరీ..సంజూ శాంసన్‌ 74 పరుగులు..
ఐపీఎల్ 2020 మ్యాచ్ 4 : రాజస్థాన్ రాయల్స్..చెన్నై సూపర్ కింగ్స్.. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
స్మిత్‌ అద్భుతమైన 69 పరుగులు..
చివరి ఓవర్లో ఆర్చర్ మెరుపులతో ఒక్క ఓవర్ లోనే 30 పరుగులు..
చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన రాజస్థాన్ 20 ఓవర్లలో 216 పరుగులు చేసి చెన్నై కు గట్టి సవాల్ విసిరింది.
3 ఓవర్లకు చెన్నై స్కోర్‌ 19/0 అంటే ప్రారంభం ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. చాలా మెల్లగా చెన్నై ప్రారంభించింది.
సామ్‌కరన్‌ 9వ ఓవర్‌ లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కానీ వెంటనే అవుట్ అయిపోయాడు. చెన్నై 9 ఓవర్లకు 77 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.
చెన్నై జట్టులో డుప్లిసిస్ దాదాపు ఒంటరి పోరాటం చేశాడు. కానీ, అది సరిపోలేదు. 19 ఓవర్లో అవుట్ అయిపోయాడు. దీంతో చెన్నై ఓటమి ఖాయం అయిపొయింది.
సంజూ సామ్సన్ సూపర్ బ్యాటింగ్.. అదరగొట్టే కీపింగ్ తో రాజస్థాన్ ..చెన్నై పై 16 పరుగులతో విజయం సాధించింది.