పసుపు తో జీర్ణశక్తి పెరుగుతుంది!

ఒక ఔన్స్ పసుపుని మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకుంటే మంగనీస్ యొక్క రోజువారీ అవసరం 26%, ఇనుము యొక్క రోజువారీ అవసరం 16% ఇస్తుంది. పసుపులో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6, మెగ్నీషియం, మరియు విటమిన్ సి ఉన్నాయి. పసుపు మనం తీసుకునే ఆహరంని జీర్ణం చేసి శరీర యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్ మరియు ఉబ్బరం తగ్గిస్తుంది.
గుండెకు మేలు చేసే పసుపు
పసుపు యొక్క అనామ్లజనియ లక్షణాలు గుండెరక్షణకు ప్రత్యేకంగా ఇవ్వబడతాయి. మధుమేహం విషయంలో పసుపులో ఉండే కర్కుమిన్ సీరం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, తద్వారా గుండె ఆరోగ్యాన్నికి దోహదపడుతుంది. పురాతన భారతీయ మరియు చైనీయుల వైద్యంలో ఛాతీ నొప్పిని చికిత్స చేయడానికి పసుపు ఉపయోగించారని పరిశోధనలు తెలుపుతున్నాయి.
మొటిమల నివారణకు పసుపు దివ్యౌషధం!
ఈ సమస్య మరీ చిన్నగా ఉండి చీము లేకపోతే కనుక రెండు చెంచాల ముల్తానీ మట్టిలో పావుచెంచా పసుపు, అరచెంచా తేనె, కొద్దిగా రోజ్‌వాటర్‌ కలపాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ పూతను వేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
కళ్లనలుపు తగ్గేలా..
మీగడ లో చిటికెడు పసుపు వేసుకుని కళ్ల చుట్టూ మర్దన చేసుకోవాలి. రెండు నిమిషాలయ్యాక తుడిచేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే కళ్ల చుట్టూ ఉండే నలుపు తగ్గి, అక్కడి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
పసుపు తో అందం..ఆరోగ్యం!
భారత దేశంలో విస్తృతంగా ప్రజలందరు ఉపయోగించే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందే. పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ పదార్ధం ఉండడం ద్వారా అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ కు పసుపు తిరుగులేని ఔషధం!
పసుపుతో బ్యాక్టేరియా, వైరల్‌ ఇన్‌ఫైక్షన్స్‌ తగ్గుతాయని మనకు తెలిసు. కానీ మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సైతం తగ్గుతాయని ఆస్ట్రేలియాలోని టాస్మానియా విశ్వవిద్యాలయానికి చేసిన అధ్యయనంలో తేలింది. కాగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 70 మందిని కొన్ని వారాల పాటు పరీక్షించగా, బాధితులకు ఉపశమనం కలిగిందని తెలిపారు. అన్నల్‌ మెడిసిన్‌, జర్నల్ ఆఫ్ మెడిసిన అధ్యయన సంస్థలు సైతం పసుపుతో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని దృవీకరించాయి.