తమ అందచందాలతో పాటు నటనతోనూ అలరిస్తున్న టాలీవుడ్ హీరోయిన్లలో కొందరు ఎంత ఎత్తు ఎదిగినా ఇప్పటికీ వారు నటించిన మొదటి సినిమాలోని పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. అటువంటి టాలీవుడ్ భామల మొదటి సినిమాలు.. పాత్రలు ఓ సారి చూద్దామా!
హైబ్రీడ్ పిల్ల..ఒక్కటే పీస్ భానుమతి.. అంటూ ప్రేక్షకులను తొలి చిత్రం తోనే 'ఫిదా' చేసేసింది సాయిపల్లవి. తరువాత ఎన్ని సినిమాలు చేసినా 'భానుమతి'ని మాత్రం ఎవరూ మర్చిపోలేరు!
ఈ పిల్ల నాదీ అని 'అర్జున్ రెడ్డి' తొ కచ్చితంగా చెప్పించిన ప్రీతి గా కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది షాలినీ పాండే. ఇప్పటికీ అందరికీ ఆమె అంటే ఎంతో ''ప్రీతి''
మొదటి సినిమాతోనే బోల్డ్ గా నటించి.. ఇందు గా కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుట్! తెలుగు సినిమాల్లో మొదటి సినిమానే నెగెటివ్ షేడ్స్ తొ ఉన్న పాత్ర చేసి సందడి చేసిన నటి పాయల్!!
'శ్రీ సాయి శిరీష ప్రభావతి' గా 'ఊహలు గుసగుసలాడే' అంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసేసింది రాశీఖన్నా. ఆమె పేరు తలుచు కుంటే చాలు ఇప్పటికీ అభిమానుల ఊహలు గుస గుసలాడుతూనే ఉంటాయి.
మొదటి సినిమాతోనే అందరూ 'ఏం మాయచేశావే' అనేశారు. 'జెస్సీ 'అంటే.. సమంతా.. అంతే అనేంత అభిమానుల గుండెలు కొల్లగొట్టింది సమంతా. కెరీర్ లో టాప్ కి చేరినా ఇప్పటికీ 'జెస్సీ' గానే అభిమానులు ఆమెను చూస్తారు!
గ్లామరస్ హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత మంది హీరోల పక్కన మురిపించినా.. ఇప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ ''వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'' సినిమాతో ఆరంగేట్రం లోనే'' ప్రార్ధన'' గా చూపించిన నటన ఎవరూ మర్చిపోలేరు!