ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. మారే 9 అంశాలు ఇవే.. మీపై ఎఫెక్ట్!
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరను స్వల్పంగా తగ్గించేశాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.10 తగ్గింది.
విమాన ప్రయాణం చేయాలని భావించే వారికి ఝలక్. ఎయిర్ సెక్యూరిటీ ఫీజు పెరిగింది. దీంతో రూ.114 వరకు ఎక్కువ చార్జీ చెల్లించాలి.
ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ ఏప్రిల్ నుంచి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకేరకమైన యాన్యుటీ ప్లాన్ అందించాలని కోరింది. దీని ద్వారా నెలకు రూ.1,000 లభించనుంది.
ఐఆర్‌డీఏఐ అలాగే స్టాండర్డ్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా అందించాలని ఇన్సూరెన్స్ సంస్థలను కోరింది. కనీసం రూ.2.5 లక్షలతో ఈ ప్లాన్ అందించాలని తెలిపింది.
ఇప్పుడు యులిప్స్‌లో డబ్బులు పెట్టేవారు ఒక విషయం గమనించాలి. వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలు దాటితే యులిప్ మెచ్యూరిటీ డబ్బులపై పన్ను పడుతుంది.
ప్రావిడెంట్ ఫండ్‌కు ఉద్యోగి కంట్రిబ్యూషన్ ఏడాదిలో రూ.2.5 లక్షలు దాటితే పన్ను భారం మోయాల్సి ఉంటుంది.
75 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన పని లేదు. అయితే వీరికి పెన్షన్ లేదా వడ్డీ తోనే ఆదాయం లభిస్తుండాలి.
కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. దీంతో మీరు కొత్త పన్ను విధానం ఎంచుకోవాలని భావిస్తే.. మీరు ఆ విషయాన్ని కంపెనీ హెచ్ఆర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని వారికి ఎక్కువ టీడీఎస్ కట్ అవుతుంది.