కళ్యాణ్ బాబు నుంచి 'ప‌వ‌న్' క‌ళ్యాణ్‌‌గా ఎలా మారారో తెలుసా? ఏపీ డిప్యూటీ సీఎం లైఫ్‌లో ఆసక్తికర విషయాలు..!

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1971న వెంకటరావు-అంజనాదేవి దంపతులకు జన్మించాడు పవన్ కళ్యాణ్
మెగాసార్ట్ చిరంజీవి పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య
పవన్ ప్రాథమిక విద్యభ్యాసం బాపట్లనే సాగింది . తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు
పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు
అయితే తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలలోని ఒకదాంట్లో `పవన్` అనే పురస్కారాన్ని అందుకున్నారు
అప్ప‌టి నుంచి కళ్యాణ్ బాబు కాస్త‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గా మారారు
1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసాడు పవన్ కళ్యాణ్
1998లో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది
2008లో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ప్రవేశించాడు. తన సోదరుడు స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా ఉన్నాడు
2014 మార్చిలో అతను జనసేన పార్టీ స్థాపించాడు.. ఆ కాలంలో అతను గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో చేరాడు
2019 లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు
2024 లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70 వేలు పైచిలుకు మెజారిటీ తో గెలుపొంది, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ అటవీ పర్యావరణ మంత్రి గా జూన్ 12,2024 వ తేదిన ప్రమాణస్వీకారం చేసారు