ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ తన నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఆక్సిజన్‌ 11.3 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఓఎస్‌లో డార్క్‌మోడ్‌ కూడా ఉంది.
ఇందులో 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు ఒకటి ఇస్తున్నారు.
వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2ఎంపీ మోనో లెన్స్ కెమెరాలు ఉన్నాయి.
ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.
నార్డ్ 2లో 4,500 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్‌ బ్యాటరీ ఇస్తున్నారు.
ఇది 65వాట్ వ్రాప్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా నిర్ణయించారు.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా నిర్ణయించారు.
హైఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా నిర్ణయించారు.