పొడవాటి జుట్టు కోసం ఆలివ్ ఆయిల్

జుట్టు పొడువుగా..మందంగా ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరిక. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
శరీరానికి బలాన్ని ఇచ్చే ఆలివ్ నూనెలో విటమిన్ ఇ, ఐరన్, కాపర్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు ఆలివ్ ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలివ్ ఆయిల్ తో కలిపిన విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సూల్ జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. అంతేకాదు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
కోడిగుడ్డును జట్టుకు పట్టించడం చాలా మంచిది. ఆలివ్ ఆయిల్ తో కలిపి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది.
అరటిపండును ఆలివ్ ఆయిల్ లో కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు బలంగా మ్రుదువుగా మారుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. జుట్టుకు మంచి కండిషనింగ్ ఇస్తుంది.
ఆలివ్ ఆయిల్ తో కలబందను మిక్స్ చేసి జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరినూనెకు బదులు ఆలివ్ ఆయిల్ జుట్టుకు రాసుకుంటే జుట్టు బలంగా మారతుుంది. ఇది జుట్టుకు విటమిన్ ఇ అందిస్తుంది. జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.
ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం, పొడిబారడం, చివర్లు చీలిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఆరోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా ఆలివ్ ఆయిల్ అందాన్ని కూడా పెంచుతుంది