Oats VS poha: ఓట్స్ vs పోహా రెండింటిలో ఏది ఆరోగ్యకరమైంది
వోట్స్ :వోట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బీటా గ్లూకాన్ గుండె మేలు చేస్తుంది. అంతేకాదు మంచి మొత్తంలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలను గుండెకు అందిస్తాయి.
అటుకులు : అటుకులలో కార్బొహైడ్రేట్లు, ఐరన్, కొంతమొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఓట్స్ లో ఉన్నన్ని పోషకాలు ఇందులోలేవు.
వోట్స్ లో కరిగే, కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
ఓట్స్ తో పోలిస్తే అటుకుల్లో తక్కువ పీచు ఉంటుంది. ఇందులో కొంత డైటరీ ఫైబర్ ఉంటుంది. ఓట్స్ లో ఉన్నంత ఎక్కువగా ఉండవు
ఓట్స్ లో సాధారణంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే అవి గ్లూకోజ్ ను రక్తంలోకి నెమ్మెదిగా విడుద చేస్తాయి. నిరంతరం శక్తిని అందిస్తుంది.
అటుకుల్లో ఓట్స్ కంటే ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను వేగంగా పెంచుతుంది.
పోహాతో పోలిస్తే ఓట్స్ లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్ ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనుకునేవారికి వోట్స్ బెస్ట్ ఆప్షన్
పోహాలో ప్రొటీన్ తక్కువగా ఉంటుంది. కానీ అందులో వేరుశనగలు, పెరుగు లేదా ఇతర ప్రొటీన్ మూలాలతో తీసుకోవచ్చు.