ఒక గిన్నెలో జాజికాయ పొడి, నిమ్మరసం, పెరుగు తీసుకుని వాటిని మిక్స్ చేయాలి. ఈ పేస్టును ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచాలి. 7
ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి మూడు సార్లు ఉపయోగించవచ్చు. ఇలా వాడితే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ముఖం కడిగిన తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ముఖంపై మొటిమలను తొలగించడానికి జాజికాయపొడి, గంధపుపొడి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లయ్ చేసుకోవాలి. 15నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
జాజికాయలో ఉండే యాంటీ ఇన్ ఫ్లెమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముఖంలోని నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి.