నైట్ డ్యూటీతో గుండెపై ప్రభావం:

నైట్ షిఫ్టుల్లో పనిచేయడం వల్ల గుండె నిర్మాణంలో, పనితీరులో చిన్న మార్పులు కనిపిస్తున్నాయని ఒక కొత్త స్టడీ చెబుతోంది.
చైనా పరిశోధకుల అధ్యయనం:
నైట్ డ్యూటీ ప్రభావంపై చైనా పరిశోధకులు చేసిన అధ్యయన ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఇవి ఉద్యోగుల్లో ఆందోళన రేపుతున్నాయి.
42,671 మంది హార్ట్ స్కాన్లు:
ఈ స్టడీలో భాగంగా పరిశోధకులు మొత్తం 42,671 మంది హార్ట్ స్కాన్లను విశ్లేషించి, వారి గుండె పరిస్థితిని పరిశీలించారు.
గుండె గోడలు కొద్దిగా మందం:
నైట్ డ్యూటీ చేసేవారి గుండె గోడలు కొద్దిగా మందంగా ఉన్నట్లు విశ్లేషణలో పరిశోధకులు గుర్తించారు.
గదులు చిన్నవిగా మారాయి:
నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారి గుండె గదులు సాధారణం కంటే చిన్నవిగా ఉన్నట్లు కూడా స్కాన్లలో స్పష్టంగా కనిపించింది.
చిన్న మార్పులే, పెద్ద భయం వద్దు:
స్కాన్లలో కనిపించిన ఈ మార్పులు చాలా చిన్నవేనని పరిశోధకులు స్పష్టం చేశారు. వీటిపై అతిగా ఆందోళన అవసరం లేదని సూచించారు.
రక్తం పంపే సామర్థ్యం సేఫ్:
గుండె రక్తాన్ని పంపే సామర్థ్యంలో మాత్రం పెద్ద మార్పులేవీ లేవని పరిశోధకులు తేల్చారు. ఇదే ఈ స్టడీలో ఊరటనిచ్చే అంశం.
తగిన నిద్ర తప్పనిసరి:
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నైట్ డ్యూటీ చేసేవారు కూడా తగిన నిద్ర పోయేలా చూసుకోవాలని పరిశోధకులు సూచించారు.
రోజూ వ్యాయామం చేయండి:
నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు గుండెను బలంగా ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని స్టడీ సూచిస్తోంది.
హెల్తీ ఫుడ్‌తో గుండె భద్రం:
తగిన నిద్ర, వ్యాయామంతో పాటు హెల్తీ ఫుడ్ తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు సూచించారు.