ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్‌ను చైనాకు చెందిన మోనీ అనే బ్రాండ్ లాంచ్ చేసింది.
దానికి మోనీ మింట్ అని పేరు పెట్టింది.
దీని స్క్రీన్ సైజు కేవలం 3 అంగుళాలు మాత్రమే ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ నెలలో అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మోనీ మింట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు 150 డాలర్లు(సుమారు రూ. 11,131) గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
మోనీ మింట్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 4జీ స్మార్ట్‌ఫోన్.
డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది.
1.5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
3జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
మైక్రో ఎస్‌డీ కార్డుతో 128జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
ఇందులో 1,250ఎంఏహెచ్ పాలీమర్ బ్యాటరీ ఉంటుంది.
ఒకసారి ఛార్జింగ్ చేస్తే 72 గంటల వరకు వాడుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.