వర్షాకాలంలో ఇండియాలో చూడాల్సిన 10 పర్యాటక ప్రదేశాలివే
భారత్ లో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కొదవేలేదు. వాటిలో ఈ ఏడాది వర్షాకాలంలో వెళ్లేందుకు సరైన ప్రదేశాలు ఏంటో చూద్దాం. ఇంక్రెడిబుల్ ఇండియా అద్భుతాలను మనమూ చూసేద్దామా?
గోవా:
మీరు బీచ్ లు ఎక్కువా ఇష్టపడితే గోవా వెళ్లొచ్చు. అక్కడి పచ్చదనం, దూద్ సాగర్ జలపాతం, సుగంధ ద్రవ్యాల తోటలు, ప్రశాంతమైన మాండోవి నదిలో బోట్ రైడ్ మరో లోకంలోకి తీసుకెళ్తాయి.
మున్నార్ :
మున్నార్ తేయాకు తోటలకు ప్రసిద్ధి. ఎరవికులం నేషనల్ పార్క్ వర్షాకాలంలో అనముడి శిఖరం చాలా అద్బుతంగా ఉంటాయి. మీరు మున్నార్ వెళ్తే ఈ ప్రదేశాలు మిస్ అవ్వకండి.
కూర్గ్
మంగళూరు నుంచి చేరుకోవచ్చు. వర్షాకాలంలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశం. ఇక్కడి కాఫీ తోటలు, జలపాతాలు, ట్రెక్కింగ్ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
షిల్లాంగ్
మీరు ప్రకృతి ప్రేమికులు అయితే షిల్లాంగ్ వెళ్లండి. అక్కడి పచ్చటి ప్రకృతి సోయగాలు, ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్ శిఖరం, ఉమియం సరస్సు మనస్సుకు హత్తుకుంటాయి.
మహాబలేశ్వర్
ఇక్కడి వాతావరణం ఎంతటి ఒత్తిడినైనా దూరం చేస్తుంది. జలపాతాలు, ప్రతాప్ గడ్ కోట, వెన్నా సరస్సు, లింగమాల జలపాతం చూడొచ్చు.
డార్జిలింగ్
డార్జిలింగ్ వెళ్తే పరాలోకంలోకి వెళ్లినట్లే ఉంటుంది. మంచుతో కప్పబడిన హిమాలయాలు, టైగర్ హిల్ చూస్తే జీవితంలో మర్చిపోలేము.
అలెప్పి
మాన్ సూన్ బ్యాక్ వాటర్స్ , బోట్ లో షికారు అలెప్పిలో చాలా ఫేమస్.