Chaddannam: ఆధునిక జీవనశైలిలో ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. మన సాంప్రదాయ వంటకమైన చద్దన్నం (పులియబెట్టిన అన్నం) శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూ, అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఇది కేవలం అల్పాహారం మాత్రమే కాదు, అనేక ఔషధ గుణాలున్న అద్భుతమైన ఆహారం. ఉదయాన్నే దీన్ని తినడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి లభించడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.