Mars: ఈ మట్టి చాలా కాస్ట్‌లీ గురూ!

Mars: అంగారక గ్రహం మట్టి ముందు పుత్తడి విలువ కూడా పనికిరాదంట.
అంగారకుడి నుంచి కిలో మట్టిని తెచ్చేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) భారీగా ఖర్చుపెడుతోందంట.
అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉందా లేదా అని పరిశీలించేందుకు అక్కడి నుంచి కిలో మట్టిని నాసా తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
కిలో బంగారం ధర కన్నా... అంతే పరిమాణంలో ఉండే ఈ మట్టి ధర ఏకంగా 2 లక్షల రెట్లు ఎక్కువుగా ఉండనుంది.
అంగారకుడి ఉపరితల నమూనాలను అక్కడి రోవర్లు ఇప్పటి వరకు పరిశోధించాయి. అక్కడి మట్టిని భూమికి తెప్పించడం మాత్రం ఇదే మొదటిసారి.
అంగారక నమూనాలను రప్పించే ప్రక్రియ మూడు దశల్లో సాగుతుంది.
మొదటి యాత్రలో ప్రయోగించిన పర్సెవరెన్స్‌ రోవర్‌.. అరుణగ్రహ ఉపరితలాన్ని పరిశీలించి, అక్కడి నుంచి నమూనాలను సేకరిస్తుంది. రెండో దశలో వెళ్లే వ్యోమనౌక.. ఆ నమూనాలను ఒక లాంచర్‌లో ఉంచుతుంది.
మూడో వ్యోమనౌక దాన్ని భూమికి తీసుకొస్తుంది. నమూనాల సేకరణించి 2023లో భూమికి తీసుకొస్తారంట.