బెంగాల్ సీఎంగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా 3వసారి ఎన్నికయ్యారు. దీదీ నిరాడంబరత, ప్రజాదరణ ముందు ప్రతిపక్షాల వ్యూహాలు నిలవలేకపోయాయి. నందిగ్రామ్‌లో ఓడినా.. తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లతో అధికారం చేపట్టింది. బెంగాల్లో హ్యాట్రిక్ సీఎంగా దీదీ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.