పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ T20లో 5000 పరుగులు పూర్తి చేసి రికార్డులు క్రియోట్ చేశాడు.
5,000 పరుగుల క్లబ్ లో రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 లో పంజాబ్, హైదరాబాద్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ T20 క్రికెట్లో 5,000 పరుగులు పూర్తి చేశాడు.
కోహ్లీ రికార్డ్ బ్రేక్
టీ 20 ల్లో 5,000 మార్కును చేరేందుకు 143 ఇన్నింగ్స్‌లు తీసుకున్న రాహుల్, విరాట్ కోహ్లీ (167), సురేష్ రైనా (173) తర్వాత ఉన్న దీర్ఘకాల రికార్డును బద్దలు కొట్టాడు.
క్రిస్ గేల్ - మొదటి స్థానం
ఇక టీ20 లో క్రిస్ గేల్ వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్ మాన్ గా రికార్డు సృష్టించాడు. కేవలం 132 ఇన్నింగ్స్ ల్లోనే పూర్తి చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.
షాన్ మార్ష్ ను అధిగమించాడు
టీ 20లో రెండో వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రాహుల్, ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్ష్ (144 ఇన్నింగ్స్) ను అధిగమించి రికార్డు నెలకొల్పాడు.