1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో కేటీఆర్ జన్మించారు.
రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న కేటీఆర్, హైదరాబాద్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేశారు.
1990-91 హైదరాబాద్ జీజీ స్కూల్ లో ఎస్‌ఎస్‌సీ, 1991-93 గుంటూరు, విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు.
1996-98 ముంబాయి, పూణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ(బయోటెక్నాలజీ) పూర్తి చేశారు
1998-2000 అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో ఎంబీఏ పూర్తి చేసి, అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచి, 2018 డిసెంబరు 17న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, 2019 సెప్టెంబరు 8న ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.