సరైన ఆహారంతో మీరోజును ప్రారంభిస్తే జీవక్రియను పెంచుతుంది.రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి .ఆకలి కోరికలను తగ్గిస్తుంది.
సరైన సమయం
బ్రేక్ ఫాస్ట్ తినేందుకు సరైన సమయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పోషకాహార నిపుణుల అభిప్రాయం
కొంతమంది పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గాలనుకునేవారు ఉదయం తేలిక పుడ్ తో బ్రేక్ ఫాస్ట్ చేయాలి.
ఎలాంటి సమయం లేదు
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు సమయం లేదు. ఎందుకంటే ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. మీరు రాత్రి ఏం తిన్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
ఆరోగ్యకరమైన సమయం
ముందు రోజు రాత్రి భోజనం, మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు మధ్య కనీసం 12గంటల గ్యాప్ ఉండాలి.
12గంటల గ్యాప్ ఎందుకు
రాత్రి భోజనం, బ్రేక్ ఫాస్ట్ మధ్య ఈ గ్యాప్ గట్ మైక్రోబ్స్, బ్యాక్టీరియా పనితీరుకు సహాయపడుతుంది. మీరు ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది.
బరువు
బరువు తగ్గాలనుకునేవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ 8 గంటల నుంచి 11గంటల మధ్య తినాలి.
పరిశోధనల ప్రకారం
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఉదయం 9గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేయడంవల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 60శాతం తగ్గుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఆలస్యంగా తినడం కేవలం ఒక సందర్భం కోసం అలవాటు కాదు. ఆలస్యంగా రాత్రిభోజనం, అల్పాహారం మానేయడం ఆరోగ్యానికి హానికరం.