రతన్ టాటా ల్యాండ్‌మార్క్ కల

2008 ఆటో ఎక్స్‌పోలో సగటు భారతీయుడి కారు కలని నెరవేరుస్తూ రతన్ టాటా 'లక్ష రూపాయల' నానోను పరిచయం చేశారు.
భారతదేశపు చవకైన కారు
ద్విచక్ర వాహనదారుల రక్షణే ధ్యేయంగా 2009లో అత్యంత చవకైన ల్యాండ్‌మార్క్ మోడల్‌గా నానో రోడ్లపైకి వచ్చింది.
ప్రతికూల ట్యాగ్‌లైన్ దెబ్బ
‘చవకైన కారు’ అనే బ్రాండింగ్ మానసిక ప్రతికూల ప్రభావం చూపడం, భద్రతా ఆందోళనలతో అమ్మకాలు పడిపోయాయి.
2018లో ఉత్పత్తికి వీడ్కోలు
మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతల వల్ల ఒకనాటి ఆటోమొబైల్ సంచలనం నానో 2018లో ఉత్పత్తిని ఆపేసింది.
ఈవీ రంగంలో టాటా జోరు
ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ 41.54% వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
రికార్డు స్థాయి విక్రయాలు
జులై 2026 నాటికి ఒక్క నెలలోనే 13,678 ఈవీ కార్లను విక్రయించి ప్రత్యర్థులపై టాటా ఆధిక్యం సాధించింది.
డిజైన్ హెడ్ వ్యాఖ్యల సంచలనం
నానో మళ్లీ వస్తుందా అన్న ప్రశ్నకు "ట్రై చేస్తాం" అని టాటా డిజైన్ హెడ్ అజయ్ జైన్ వ్యాఖ్యానించారు.
సాంకేతికంగా నానో ఈవీ సాధ్యమే
ఆధునిక సాంకేతికతతో 200 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే నానో ఈవీని తీసుకురావడం సాధ్యమేనని నిపుణుల అంచనా.
టాటా మోటార్స్ అధికారిక ప్రకటన
డిజైన్ హెడ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, నానో ఈవీ పునరాగమనంపై ఎలాంటి అధికారిక ప్రణాళికలు లేవని సంస్థ తెలిపింది.
చెరిగిపోని భారతీయుల భావోద్వేగం
అధికారిక ప్లాన్ లేకపోయినా నానో ఈవీపై చూపించే క్రేజ్, సగటు భారతీయుడికి దానిపై ఉన్న అభిమానానికి నిదర్శనం.