గర్భంతో ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నా కూడా ఆచితూచి తీసుకుంటారు. ఎందుకంటే వారు తీసుకునే ఆహారం కడుపులో ఉండే బిడ్డకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి.
అయితే బొప్పాయి పండు తీసుకుంటే గర్భిణీలకు గర్భస్రావం అవుతుందని చాలామంది చెబుతూ ఉంటారు ఇందులో నిజా నిజాలు ఏంటో తెలుసుకుందాం.
నిజానికి గర్భస్రావానికి బొప్పాయి పండు కి ఎలాంటి సంబంధం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కానీ పచ్చి బొప్పాయి విషయంలో మాత్రం తినకుండా ఉంటే మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే గర్భిణీలు మాత్రమే కాదు మామూలు వారు తిన్నా కూడా అజీర్ణం చేసే అవకాశం ఉంటుంది.
గర్భిణీలు పండిన బొప్పాయితిన్నట్లయితే వారికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి అని చెప్తున్నారు.
2002 సంవత్సరంలో జరిపిన ఒక శాస్త్రీయ అధ్యయనంలో గర్భంతో ఉన్న ఎలుకలకు బొప్పాయి పండు తినిపిస్తే… వాటికి కావాల్సిన పోషకాలు లభించాయని వైద్యులు చెబుతున్నారు.
బొప్పాయి పండు వల్ల అంతేకాదు ఎలుకల్లో ఎలాంటి దుష్ప్రభావాలు చోటు చేసుకోలేదని చెప్తున్నారు.
గర్భిణీలు బొప్పాయి పండును హాయిగా తినవచ్చని ఈ శాస్త్రీయ అధ్యయనంలో తేలింది.
బొప్పాయి పండు తో పాటు యాపిల్, మామిడిపండు, అరటిపండు ఇలా పలు రకాల పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు.
అయితే పచ్చిగా ఉండే పండ్లను తినడం గర్భిణీలకు మంచిది కాదని సూచిస్తున్నారు. పచ్చిగా ఉండే పండ్లు జీర్ణక్రియకు అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది.
పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీన్ని వైద్య సలహాగా ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరాదు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సంబంధిత డాక్టర్ ను సంప్రదించండి.