IPL 2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే షాక్.. దూరమవుతున్న స్టార్ ప్లేయర్లు వీరే

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అలాగే జాక్ ఎడ్వర్డ్స్ పాదం గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK): ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): యంగ్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయంతో టోర్నీకి దూరం కాగా, స్టార్ పేసర్ మతీష పతిరాణ కాలి గాయంతో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు.
రాజస్థాన్ రాయల్స్ (RR): స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్ 19వ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC): వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా మిచెల్ స్టార్క్ కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోనున్నాడు.
ముంబై ఇండియన్స్ (MI): మోకాలి గాయం కారణంగా అథర్వ అంకోలేకర్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో (LSG): వ్యక్తిగత కారణాలతో లాకీ ఫెర్గూసన్, జోష్ ఇంగ్లిస్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు.