సురేష్ రైనా రికార్డు
ఆదివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో సురేష్ రైనా 200 సిక్సర్లు పూర్తి చేశాడు.
ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం(25-04-2021) ముంబైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈమ్యాచ్‌లోనే రైనా అత్యధిక సిక్సర్ల మైలురాయిని సాధించాడు.
బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే మొదటి వికెట్‌కు 74 పరుగులతో మంచి ఆరంభాన్ని అందించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిన తరువాత, రైనా బ్యాటింగ్ కి వచ్చాడు. మూడు సిక్సర్లతో 24 పరుగులు సాధించిన రైనా.. 200 సిక్సుల మార్కును తాకాడు.
ఐపీఎల్లో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత 200 సిక్సర్లు కొట్టిన నాలుగో భారతీయుడిగా రైనా రికార్డు సాధించాడు.
ముంబయి ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో ఇప్పటివరకు 222 సిక్సర్లు కొట్టాడు. టోర్నమెంట్లో అత్యధిక సిక్సర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్లో 185 ఇన్నింగ్స్‌లలో 217 సిక్సర్లు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కె) కెప్టెన్ ఎంఎస్ ధోని.. అత్యధిక సిక్సర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 2008 లో సీఎస్కే జట్టులో ధోని, రైనా ఇద్దరు కీలకంగా మారారు.
ఐపీఎల్లో ఆల్ టైమ్ లీడింగ్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లీ.. ఈ టోర్నమెంట్లో 188 ఇన్నింగ్స్‌లలో 204 సిక్సర్లు కొట్టాడు.
ఆర్సీబీలో కోహ్లీ సహచరుడు ఏబీ డివిలియర్స్ ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. కేవలం 159 ఇన్నింగ్స్‌లలో 240 సిక్సులు కొట్టాడు.
ఐపీఎల్లో గేల్ కంటే ఏ బ్యాట్స్‌మన్ కూడా ఎక్కువ సిక్సర్లు కొట్టలేదు. కేవలం 136 ఇన్నింగ్స్‌లలో 354 సిక్సర్లు కొట్టి తొలి స్థానంలో నిలిచాడు.