టైం లిమిట్
ఐపీఎల్ 2021 లో ప్రతి టీం 90 నిమిషాల్లో 20 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి ఇన్సింగ్స్ కు 90 నిమిషాలు కేటాయించారు. దీంట్లోనే 2 స్ట్రాటజిక్ టైమ్ ఔట్లను 5 నిమిషాల చొప్పున కేటాయించారు. బ్రేక టైం 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు.
ఒక్కో జట్టు గంటలో 14.11 ఓవర్లు బౌలింగ్ పూర్తి చేయాలి. స్లో ఓవర్ రేట్ రికార్డైతే ఆ టీం కెప్టెన్‌కు మొదటి సారి రూ.12 లక్షల ఫైన్ విధిస్తారు. ఇక రెండోసారి రిపీట్ అయితే, రూ. 24 లక్షలు, మూడు, నాలుగోసారికి 30 లక్షల జరిమానా వేస్తారు. మరలా ఇదే రిపీట్ అయితే, తర్వాతి మ్యాచ్ లో ఆడకుండా నిషేధం విధిస్తారు.
ఐపీఎల్ 2021లో ఆన్ ఫీల్గ్ అంపైర్లకు సాప్ట్ సిగ్నల్ అవకాశం లేదు. క్యాచ్ విషయంలో సందేహం ఉన్నా, బంప్ బాల్స్ సంధించినా, రూల్స్ అతిక్రమించినా థర్డ్ అంపైరే నిర్ణయం తీసుకుంటారు.
సూపర్ ఓవర్లపై ఈ సీజన్ లో పరిమితి విధించారు. సూపర్ ఓవర్ ను గంటలో కంప్టీట్ చేయాలి. ఒక్క నిమిషం ఎక్కువైనా సూపర్ ఓవర్‌ను రద్దు చేస్తారు. పాయింట్లను ఇరు జట్లకు సమానంగా కేటాయిస్తారు.
గత సీజన్ లో బ్యాట్స్‌మెన్ రన్నింగ్ చేసేటప్పుడు క్రీజు గీత తాకకుండా పరుగులు చేసినప్పుడు, బ్యాటింగ్ టీం రన్స్ నుంచి కోత విధిస్తాడు అంపైర్. ఈ సీజన్ లో అంపైర్ నిర్ణయాన్ని రద్దు చేసే అవకాశం థర్డ్ అంపైర్ కు ఇచ్చారు.
చెన్నైకు వచ్చే ఆటగాళ్లు తమిళనాడు ప్రభుత్వం మంజూరు చేసే స్సెషల్ ఈ-పాస్ పొందాలి. లేదంటే వారిని అనుమతించరు.
ఆటగాళ్లు వారం రోజుల్లో 3 సార్లు RT-PCR పరీక్షలు చేయించుకోవాలి. వీటిల్లో నెగిటివ్ వస్తేనే బయో బబుల్ లోకి అనుమతిని ఇస్తారు.